చత్తీస్గఢ్లో ఎన్కౌంటర్లు: 22 మంది మావోయిస్టులు మృతి
Published on: Fri Jun 29, 2012 4:11PM
చత్తీస్గఢ్ రాష్ట్రంలో మూడు వేర్వేరు చోట్ల జరిగిన భారీ ఎన్ కౌంటర్లలో 22 మంది మావోయిస్టులు మృతి చెందారు. బీజాపూర్ జిల్లా స్టేషన్ బసాగూడ అటవీ ప్రాంతంలో పోలీసులకు మావోల మధ్య కాల్పులు జరిగాయి. ఎదురుకాల్పుల్లో 18 మావోయిస్టులు మృతి చెందగా, ముగ్గురు గాయపడ్డారు. ఆరుగురు సీఆర్పీఎఫ్ జవానులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం రామ్పూర్ ఆస్పత్రికి తరలించారు. గ్రామస్తులు, మావోయిస్టులకు మధ్య సమావేశం జరుగుతున్న సమయంలో ఈ కాల్పులు జరిగాయి. పోలీసుల అదుపులో ఓ మావోయిస్టు ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు నారాయణపూర్ జిల్లా అబూజ్మఢ్లో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. ఘటనా స్థలం నుంచి 303 రైఫిల్లు, నాలు తుపాకీలను స్వాధీనం చేసుకున్నారు.


