TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

నిద్రలో ఉన్న 20 మందిని కాల్చేశారు

Published on: Sat Apr 11, 2015 12:38PM

 

నిద్రపోతున్న 20 మందిని అన్యాయంగా కాల్చి చంపేశారు. ఈ దారుణమైన ఘటన పాకిస్థాన్ బెలూచిస్థాన్ ప్రావెన్స్లోని టుర్బట్ నగరంలో చోటు చేసుకొంది. వివరాల ప్రకారం టుర్బట్ నగర శివారులోని స్థానికంగా బ్రిడ్జి నిర్మాణం కోసం వచ్చిన కొంతమంది కార్మికులు ఉంటున్నారు. అయితే ఈ కార్మికులపై ఓ ఆగంతకుడు విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో 20 మంది కార్మికులు మరణించగా, ముగ్గురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారని పోలీసు ఉన్నతాధికారి వెల్లడించారు. గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పారు. కార్మికుల శరీరాల్లోకి బులెట్లు దూసుకుపోవడంవల్ల మృత దేహాలు గుర్తు పట్టకుండా ఉన్నాయని, ఇది తీవ్రవాదుల చర్యగా భావిస్తున్నామని పోలీసులు తెలిపారు.