TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

18 వందల కిలోల బంగారం.. శ్రీవారి ఖాతాలో....

Published on: Sat Aug 2, 2014 2:16PM

 

యావత్ దేశంలోనే భారీ బంగారం డిపాజిట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అకౌంట్‌లో జరిగింది. ఆ బంగారం అంతా ఇంతా కాదు.. ఏకంగా 1800 కిలోల బంగారం. ఇంత బంగారం డిపాజిట్ అయింది వేరెవరి ఖాతాలోనో కాదు.. సాక్షాత్తూ లక్ష్మీపతి అయిన ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి వారి ఖాతాలో. సిరిగలవానికి చెల్లున్ అని ఓ భక్త మహాశయుడు ఊరకే అన్నాడా..! శ్రీవారికి భక్తులు కానుకలుగా ఇచ్చిన బంగారాన్ని సేకరించి మొత్తం 18 వందల కిలోల బంగారాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియాలో డిపాజిట్ చేశారు. ఈ బంగారం డిపాజిట్ ద్వారా వచ్చే వడ్డీని బ్యాంక్ బంగారం రూపంలోనే చెల్లిస్తుంది. ఆ బంగారాన్ని కూడా తిరిగి బ్యాంకులోనే జమ చేస్తారు. ఈ బంగారం డిపాజిట్‌కి సంబంధించిన పత్రాలను టీటీడీ ఇ.ఓ. గోపాల్ స్టే్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్ పర్సన్ అరుంధతీ భట్టాచార్యకు అందించారు.