రావత్‌కు 17 గన్ సెల్యూట్.. 800మందితో అరుదైన సైనిక లాంఛనం..
Published on: Fri Dec 10, 2021 1:35PM
దేశ తొలి సీడీఎస్ అంత్యక్రియలంటే మాటలా. అత్యంత అరుదైన సైనిక లాంఛనంతో బిపిన్ రావత్‌కు అంతిమ వీడ్కోలు పలకనున్నారు. త్రివిధ దళాలకు చెందిన ముఖ్యులంతా ముందుండి నడవనున్నారు. సాయంత్రం ఢిల్లీలోని బ్రార్ స్క్వేర్ శ్మశాన వాటికలో సైనిక లాంఛనాల నడుమ అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు.
అంతిమ యాత్రలో.. త్రివిధ దళాల్లోని అన్ని ర్యాంకులకు చెందిన 99 మంది అధికారులు పాల్గొననున్నారు. 33 మందితో ట్రైసర్వీస్ బ్యాండ్ ముందు వెళ్లనుంది. మరో 99 మందితో కూడిన త్రివిధ దళాల బృందం రేర్ ఎస్కార్ట్‌గా అంతిమయాత్రను అనుసరించనుంది.
సీడీఎస్ బిపిన్ రావత్ అంతిమ సంస్కారాల్లో మొత్తం 800 మంది డిఫెన్స్ సర్వీస్ సిబ్బంది పాల్గొంటారు. అంత్యక్రియల సమయంలో గౌరవసూచికంగా 17 గన్ సెల్యూట్ జరుపుతారు.


