TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఈ రోజు భారతీయ రైల్వే 165 వ పుట్టిన రోజు

Published on: Thu Apr 16, 2020 12:49PM

1853 ఏప్రిల్ 16, సమయం: మధ్యాహ్నం 3 గంటల 35 నిమిషాలు. బాంబే (ప్రస్తుతం ముంబై) లోని బోరి బందర్ నుంచి మొట్టమొదటి రైలు 34 కిలోమీటర్ల దూరం లోని థానే కు బయల్దేరింది. ఈ అద్భుత ఘట్టాన్ని వీక్షించటానికి వందలమంది జనం, బోరి బందర్ రైల్వే ప్లాట్ ఫార్మ్ మీద వందల మంది జనం గుమికూడారు. ఇది నేటికి 165 సంవత్సరాల క్రితం జరిగిన గొప్ప ప్రజా వేడుక. భారత దేశంలో రైల్వేలు మొదటిసారిగా 1853 లో ప్రవేశపెట్టబడ్డాయి.1947(స్వతంత్రం వచ్చే) నాటికి దేశంలో మొత్తం42 రైల్వే సంస్థలు నెలకొల్పబడి వున్నాయి. 1951లో ఈ సంస్థలన్నింటినీ కలుపుకొని భారత రైల్వే, ప్రపంచంలోని అతి పెద్ద రైల్వే సంస్థలలో ఒకటిగా ఆవిర్బవించింది. భారత రైల్వే దూర ప్రయాణాలకు మరియు నగరాలలో దగ్గరి ప్రయాణాలకు (సబర్బన్ (suburban) అనగా పట్టణపు పొలిమేరలవరకు) అవసరమైన రైళ్ళను నడుపుతోంది. రైలు మార్గాలు భారతదేశపు నలుమూలలా విస్తరించి వున్నాయి. భారతీయ రైలు మార్గాలపై ప్రభుత్వానికి ఏకఛ్ఛత్రాధిపత్యం ఉంది. 

భారతీయ రైల్వేలు ప్రపంచంలోనే అత్యంత రద్దీ కలిగిన రైలు మార్గాలలో ఒకటి. రైలు మార్గాలు మొత్తం దూరం సుమారుగా 114500 కి.మీ. ఇది సుమారు 65000 కి.మీ రూటు పై వుంది మరియు 7500 స్టేషన్లు వున్నాయియ 20 11 నాటికి రైల్వేల వద్ద 2,40,000 వాగన్లు, 69,000 కోచ్ లు, 9000 ఇంజిన్లు వున్నాయి. ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో ఉద్యోగులను కలిగి వున్న సంస్థలలొ భారతీయ రైల్వేది (సుమారు పదనాలుగు లక్షలు)ద్వితీయ స్థానము. భారతీయ రైల్వే కంప్యూటరీకరణలో అన్నిటిలో ప్రథమ స్థానంలో వుంది. ముందస్తుగా ప్రయాణం ఖరారు చేసుకునేటందులకు మరియు మార్పులు చేసుకునేందుకు సౌకర్యం అందిస్తోంది. ఈ విభాగం భారతీయ రైల్వే ఆహార నిర్వహణ మరియు పర్యాటక సంస్థ నిర్వహిస్తుంది. ఇది భారతీయ రైల్వే మంత్రిత్వ శాఖ కింద పని చేస్తూ భారత రైల్వే రవాణా వ్యవస్థను నిర్వహిస్తూ ఉంటుంది. రైల్వే మంత్రిత్వ శాఖ కేంద్ర రైల్వే మంత్రి (కేబినెట్ హోదా) నిర్వహణలో ఉండే రైల్వే విభాగం, రైల్వే బోర్డు కింద పని చేస్తుంది. దీనిని పరిపాలనా సౌలభ్యం కోసం 17 జోన్లుగా విభజించారు.

1. ఉత్తర రైల్వే------- ఢిల్లీ
2. ఈశాన్య రైల్వే------ గోరఖ్‌పూర్
3. ఈశాన్య సరిహద్దు రైల్వే-----గౌహతి
4. తూర్పు రైల్వే----- కోల్కతా
5.ఆగ్నేయ రైల్వే ------ కోల్కతా
6. దక్షిణ మధ్య రైల్వే ------- సికింద్రాబాదు
7. దక్షిణ రైల్వే------- చెన్నై
8 . మధ్య రైల్వే-------- ముంబై
9. పశ్చిమ రైల్వే ----- ముంబై ముంబై సెంట్రల్
10. నైఋతి రైల్వే------ హుబ్లీ
11. వాయువ్య రైల్వే--------- జైపూరు
12. పశ్చిమ మధ్య రైల్వే------- జబల్ పూర్
13. ఉత్తర మధ్య రైల్వే------- అలహాబాదు
14. ఆగ్నేయ మధ్య రైల్వే ------- బిలాస్‌పూర్
15. తూర్పు తీర రైల్వే------ భువనేశ్వర్
16. తూర్పు మధ్య రైల్వే----- హాజీపూర్
17. కలకత్తా మెట్రో రైల్వే ------- కలకత్తా