మచిలీపట్నం వద్ద మత్స్యకారుల వలలో 1.5 టన్నుల సొరచేప
Published on: Mon Jul 29, 2024 12:09PM
మచిలీపట్నం వద్ద సముద్రంలో మత్స్యకారుల వలకు ఓ భారీ సొర చేప చిక్కింది. దీని బరువు ఒకటిన్నర టన్నులు ఉంది. దీన్ని మచ్చల సొర అని పిలుస్తారు. గిలకలదిండి వద్ద స్థానిక మత్స్యకారులు దీన్ని ఒడ్డుకు తీసుకువచ్చేందుకు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. ఓ క్రేన్ సాయంతో దీన్ని వెలుపలికి తీసుకువచ్చారు. చెన్నైకి చెందిన వ్యాపారులు ఈ భారీ సొర చేపను కొనుగోలు చేశారు. ఈ తరహా సొర చేపలు తీరానికి చేరువగా రావడం చాలా అరుదు. ఒక్కోసారి ఇతర చేపలను వేటాడుతూ ఇవి తీరాలకు దగ్గరగా వస్తుంటాయి. అలాంటి సమయాల్లోనే మత్స్యకారుల వలలకు చిక్కుతుంటాయి.అతి కష్టమ్మీద ఒడ్డుకు మత్స్యకారులు చేర్చారు. ఆయుర్వేద మందుల్లో వాడే పదార్థాలు ఉంటాయనే ఆశతో దీనిని కోసి చూశారు. అవేమీ లేకపోవడంతో పాటు మాంసం రబ్బరు మాదిరిగా ఉండి తినడానికి పనికిరాదని తెలుసుకుని నీటిలో పడేశారు. సాధారణంగా ఇలాంటి చేపల్లో నల్లబంగారంగా పిలిచే ఔషధ గుణాలున్న పదార్థం ఉంటుందని, ఈ తరహా చేపలు జాలర్లకు అరుదుగా దొరుకుతాయని స్థానిక మత్స్యకారులు చెబుతున్నారు.


