TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఒక్కరోజే 14 ఒమిక్రాన్ కేసులు.. తెలంగాణ లాక్ డౌన్ తప్పదా!

Published on: Wed Dec 22, 2021 7:39PM

ఒమిక్రాన్ వైరస్ తెలంగాణలో విజృంభిస్తోంది. బుధవారం ఒక్కరోజే రాష్ట్రంలో కొత్తగా 14 కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 38కి పెరిగింది. తాజాగా నమోదైన కేసుల్లో రెండు రిస్క్ కంట్రీస్ నుంచి వచ్చిన కేసులు కాగా.. మిగితా 12 నాన్ రిస్క్ కంట్రీస్ నుంచి వచ్చిన వారిలో నిర్దారణ అయింది. ఒమిక్రాన్ కేసుల్లో ప్రస్తుతం దేశంలో మూడో స్థానంలో ఉంది తెలంగాణ. ఢిల్లీ, మహారాష్ట్ర తర్వాత తెలంగాణలో ఎక్కువ కేసులు నమోదయ్యాయి.

తెలంగాణలో కాంటాక్ట్ కు కూడా ఒమిక్రాన్ సోకడం కలకలం రేపుతోంది. విదేశాల నుంచి వచ్చిన వ్యక్తికి ఒమిక్రాన్ నిర్దారణ కాగా.. అతనికి చికిత్స చేసిన ఓ ప్రైవేట్ హాస్పిటల్ డాక్టర్ కు ఒమిక్రాన్ సోకింది. ఆ డాక్టర్ భార్యకు కూడా కరోనా పాజిటివ్ రాగా.. ఒమిక్రాన్ రిపోర్టు రావాల్సి ఉంది. ఒమిక్రాన్ కేసులు పెరిగిపోతుండటంతో వైద్య వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. 

ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నందున రాష్ట్రంలో ఆంక్షలు విధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. క్రిస్మస్ తో పాటు న్యూ ఇయర్ రోజున ఆంక్షలు విధించాలని ప్రభుత్వం ఆలోచిస్తుందని తెలుస్తోంది. వైద్య వర్గాలు కూడా ప్రభుత్వానికి ఈ దిశగా ప్రతిపాదనలు చేశాయని చెబుతున్నారు.