Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...మాజీ మంత్రి కాకాణికి 14 రోజుల రిమాండ్
posted on: May 26, 2025 3:14PM

వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డికి నెల్లూరు జల్లా వెంకటగిరి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో కాకాణిని నెల్లూరు జిల్లా జైలుకు తరలించారు. అక్రమమైనింగ్ సహా పలు కేసులను ఎదుర్కొంటున్న కాకాణి గోవర్ధన్ నెడ్డిని బెంగళూరు సమీపంలో అరెస్టు చేసినట్లు పోలీసులు కోర్టుకు తెలిపారు.
వాస్తవానికి ఆదివారం ఆయన ను కేరళలో అరెస్టు చేసినట్లు వార్తలు వచ్చాయి. కానీ ఆయనను బెంగళూరులో అదుపులోనికి తీసుకుని నెల్లూరుకు తరలించినట్లు పోలీసులు ధృవీకరించారు. ఆదివారం (మే 25)న కాకాణిని బెంగళూరు వద్ద అరెస్టు చేసిన పోలీసులు ఆయనను సోమవారం (మే26) ఉదయం నెల్లూరుకు తీసుకువచ్చి ఇక్కడి పోలీసు శిక్షణ కేంద్రంలో ఉంచారు. అనంతరం భారీ బందోబస్తు నడుమ వెంకటగిరి కోర్టులో హాజరు పరిచారు.
అనంతరం కోర్టు కాకాణికి 14 రోజుల రిమాండ్ విధించింది. అక్రమ మైనింగ్, పేలుడు పదార్థాల అక్రమ వినియోగం, కోట్లాది రూపాయల విలువైన ఖనిజాల అక్రమ రవాణా, ఎస్సీఎస్టీ అట్రాసిటీ సహా కాకాణిపై పలు కేసులు ఉన్న సంగతి విదితమే.




.webp)


