శ్రీనగర్ ఆస్పత్రిలో 14 మంది చిన్నారులు మృతి
Published on: Sat Sep 13, 2014 2:35PM

కాశ్మీర్ చరిత్రలో ఎరగని ఘోరమైన వరదల కారణంగా ఇప్పటికే రెండు వందల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. శనివారం నాడు శ్రీనగర్‌లోని జీబీ పాంట్ ఆస్పత్రిలో 14 మంది చిన్నారులు చనిపోయినట్టు అధికారులు తెలిపారు. వరదల కారణంగా వాతావరణంలో భారీ మార్పు రావడంతో అస్వస్థతకి లోనై ఈ చిన్నారులు మరణించారని అధికారులు తెలిపారు. వరద తగ్గుముఖం పడుతూ వుండటంతో ఇప్పుడు మృతదేహాలు బయడపడుతున్నాయి. ఒక్క శనివారం రోజు మధ్యాహ్నానికి 29 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు.


