TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఒకే విమానంలో 125 మందికి కరోనా.. ఇండియా అల‌ర్ట్‌...

Published on: Thu Jan 6, 2022 3:17PM

అంచ‌నాల‌ను మించి ఒమిక్రాన్ అత్యంత వేగంగా వ్యాపిస్తోంది. ప‌దులు, వంద‌లు, వేల‌ల్లో పాజిటివ్‌ కేసులు న‌మోద‌వుతున్నాయి. విదేశాల నుంచి పెద్ద సంఖ్య‌లో ఒమిక్రాన్ కేసులు డంప్ అవుతున్నాయి. ఇండియాకు ఓ విమానం వ‌స్తే చాలు.. అందులో అనేక కొవిడ్ కేసులు ఉంటుండ‌టం క‌ల‌క‌లం రేపుతోంది. లేటెస్ట్‌గా ఇట‌లీ నుంచి పంజాబ్‌కు వ‌చ్చి ఓ ఛార్టెడ్ ఫ్లైట్‌లో ఏకంగా 125 పాజిటివ్ కేసులు రావ‌డం దారునం. ఆ విమానంలో ఉన్న‌దే 179 మంది.. అందులో 125 కేసులంటే మామూలు విష‌య‌మా? ఇదేదో కొంప‌ముంచే మ‌హ‌మ్మారే అంటున్నారు. 

దేశంలో ఒమిక్రాన్‌ వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై కేంద్రం ప‌లు నిబంధ‌న‌లు విధించింది. విమానాశ్ర‌మంలో కొవిడ్ ప‌రీక్ష‌లు త‌ప్ప‌నిస‌రి చేసింది. ఇందులో భాగంగా.. ఇటలీ నుంచి ఓ ఛార్టెడ్‌ విమానం అమృత్‌సర్‌ ఎయిర్‌పోర్టుకు రాగా.. అందులోని ప్రయాణికులకు కొవిడ్‌ పరీక్షలు చేశారు. 179 మందికి ర్యాపిడ్‌ టెస్టు చేస్తే.. 125 మంది ప్రయాణికులకు వైరస్‌ సోకినట్లు తేలింది. దీంతో అధికారులు ఉలిక్కిప‌డ్డారు. వెంట‌నే అప్రమత్తమయ్యారు. 

కొవిడ్‌ బాధితులెవ‌రూ బ‌య‌ట‌కు వెళ్ల‌కుండా క‌ట్టుదిట్టం చేశారు. వారంద‌రినీ క్వారంటైన్‌కు తరలించేందుకు అంబులెన్సుల‌ను పిలిపించ‌గా.. ఆ వాహ‌నాలు ఎయిర్‌పోర్టు ముందు వ‌రుస క‌ట్టాయి. ఒకే విమానంలో 125 మందికి కొవిడ్ పాజిటివ్ వ‌చ్చింద‌నే న్యూస్ దేశ‌వ్యాప్తంగా వైర‌ల్‌గా మారింది.