TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

1200 కోట్లు ఫ‌స‌క్‌..! ఏపీలో మ‌రో భారీ నిధుల మ‌ళ్లింపు!

Published on: Thu Dec 30, 2021 12:10PM

ఏపీలో స్కాంలకు కొద‌వ లేదంటారు. మ‌ద్య‌పాన నిషేధ‌మే అన్నిటికంటే బిగ్ స్కాం అంటారు. ఒక్క బ్రాండ్ వెనుక.. ఒక్కో డీల్ ఉందంటారు. ఇసుక అమ్మ‌కాలతో వేల కోట్లు కొల్ల‌గొడుతున్నార‌ని చెబుతారు. ఇక నిధుల మ‌ళ్లింపు గురించి చెప్పేదేలే. కార్పొరేష‌న్ అకౌంట్ల పేరుతో అన్ని విభాగాల నిధుల‌నూ సంక్షేమ ప‌థ‌కాల వైపు మ‌ళ్లించేస్తోంది. ద‌మ్మిడి రాబ‌డి లేక‌.. ఉద్యోగుల‌కు జీతాలు ఇవ్వ‌లేక‌.. కొత్త అప్పులు ముట్ట‌క‌.. ఆగ‌మాగం అవుతోంది. తాజాగా, మ‌రో 1200 కోట్ల నిధుల డైవ‌ర్ష‌న్‌పై సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టారు టీడీపీ అధికార ప్ర‌తినిధి ప‌ట్టాభి.

లాభాల్లో ఉన్న గంగవరం పోర్టును అందినకాడికి అమ్మినట్లే.. ఏపీ మారిటైం బోర్డు నిధులను సైతం ప్రభుత్వం దారి మళ్లించిందని టీడీపీ నేత పట్టాభిరామ్‌ ఆరోపించారు. భవిష్యత్తులో రాష్ట్రంలోని అనేక పోర్టులకు ఉపయోగించాల్సిన మారిటైమ్‌ బోర్డు నిధులు రూ.1,200 కోట్లను కొల్లగొట్టిందని ఆక్షేపించారు. 

అప్పుల ఊబిలో చిక్కుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడికక్కడ వ్యవస్థలను నిర్వీర్యం చేస్తోందని ప‌ట్టాభి ఆరోపించారు. గ‌తంలో గంగవరం పోర్టుపై తాము లేవనెత్తిన అంశాలపై ఇప్పటి వరకు ప్ర‌భుత్వం సమాధానం చెప్పలేదని నిల‌దీశారు. మంత్రుల నుంచి సమాధానం రాలేదంటే తప్పు చేశారనేగా అని ప‌ట్టాభిరామ్ తేల్చేశారు.