గాంధీలో అద్బుతం.. కరోనాను జయించిన 110 ఏళ్ల వృద్దుడు 

కొవిడ్ హాస్పిటల్ గా గాంధీ వైద్యులు ప్రాణాలకు తెగించి చికిత్స అందిస్తున్నారు. గత 14 నెలలు వేలాది మందికి ప్రాణం పోశారు. ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా ఉండటంతో గాంధీ హాస్పిటల్ లో రోగులతో నిండిపోయింది. రోజూ వందలాది మంది కొత్త పేషెంట్లు వస్తుండగా.. వందలాది మంది కరోనాను జయించి డిశ్చార్జ్ అవుతున్నారు. తాజాగా గాంధీ కొవిడ్ హాస్పిటల్ లో అద్బుతం జరిగింది. 110 ఏండ్ల రామనంద కరోనాను జయించారు.

110 సంవత్సరాలున్న రామనంద తీర్థ 10 రోజుల క్రితం కరోనా భారీన పడ్డారు. ఆయనకు లక్షణాలు తీవ్రంగా ఉండటంతో  ఎనిమిది రోజుల క్రితం గాంధీ హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యారు. గాంధీ వైద్య సిబ్బంది ఇచ్చిన చికిత్సతో కరోనా నుంచి కోలుకున్నారు రామనంద. దేశంలోనే అతిపెద్ద వయసు గల వ్యక్తి కరోనాను జయించాడని  గాంధీ హాస్పిటల్ సూపరింటెండెంట్ రాజా రావు ప్రకటించారు. గాంధీ వైద్య సిబ్బందికి ఆయన అభినందనలు తెలిపారు.