TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తూచ్.. ఏపీ టెన్త్ ఫలితాలు ఇవాళ కాదు!

Published on: Sat Jun 4, 2022 1:09PM

ఏపీలో టెన్త్ ఫలితాల విడుదల వాయిదా పడింది. చివరి నిముషం వరకూ శనివారం ఉదయం 11 గంటలకల్లా టెన్త్ ఫలితాలు విడుదల చేస్తామంటూ ప్రకటించిన విద్యాశాఖ అధికారులు తూచ్.. ఈ రోజు కాదు సోమవారం అంటూ వాయిదా ప్రకటన చేశారు.

ఫలితాల కోసం ఉదయం నుంచీ ఎంతో ఆత్రుతగా ఎదురు చూసిన విద్యార్ధులు చివరి నిముషంలో వాయిదా ప్రకటన వెలువడటంతో నిరాశ చెందారు. అనివార్య కారణాలను ఉటంకిస్తూ విద్యాశాఖ అధికారులు ఫలితాల ప్రకటనను సోమవారానికి వాయిదా వేవారు. ఏపీలో విద్యాశాఖ మంత్రి మారినా విద్యాశాఖ తీరు ఇసుమంతైనా మారలేదు. ప్రతి విషయంలోనూ గందరగోలం, అయోమయం సృష్టించేలా నిర్ణయాలు తీసుకోవడం ఆ తరువాత నాలుక కరుచుకోవడం విద్యాశాఖ కు ఒక అలవాటుగా మారిపోయింది.

గత రెండేళ్లలో కోవిడ్ మహమ్మారి విజృంభణ సమయంలోనూ విద్యాసంస్థలను తెరుస్తామనీ, ఆఫ్ లైన్ లో కాదు ఆన్ లైన్ లో పరీక్షలు నిర్వహించి తీరుతామని ప్రకటించి, చివరి నిముషంలో ఆ నిర్ణయాన్ని ఉప సంహరించుకోవడం పలుమార్లు జరిగింది.  

సరైన సమయంలో సరైనా నిర్ణయం తీసుకోలేకపోవడం, తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉండకపోవడం  ఏపీ ప్రభుత్వ విధానంగా ఉందన్న విమర్శలు విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి వెల్లువెత్తుతున్నాయి.