TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

108 అడుగుల హనుమాన్.. విగ్రహం ఆవిష్క‌రించిన పీఎం..

Published on: Sat Apr 16, 2022 12:49PM

దేశ వ్యాప్తంగా శనివారం హనుమజ్జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ గుజరాత్ రాష్ట్రం మోర్బీలోని బాపూ కేశ్వానంద్ ఆశ్రమంలో ఏర్పాటు చేసిన 108 అడుగుల భారీ హనుమాన్ విగ్రహాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆవిష్కరించారు. 

హనుమాన్ జీ చార్ ధామ్ ప్రాజెక్టులో భాగంగా దేశం నలు దిక్కుల్లో నాలుగు భారీ హనుమాన్ విగ్రహాలను ప్రతిష్ఠించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో రెండో భారీ హనుమాన్ విగ్రహాన్ని ప్రధాని మోడీ రిమోట్ ద్వారా ఆవిష్కరించారు. ఇక ఉత్తరాదిన 2010లో సిమ్లాలో మొదటి భారీ హనుమాన్ విగ్రహం ఏర్పాటు చేశారు.