TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

భార్య‌ల మార్పిడి య‌వ్వారం.. 1000 జంట‌లతో ఇల్లీగ‌ల్ ఎఫైర్స్‌...

Published on: Mon Jan 10, 2022 11:02AM

అదేదో హిందీ సినిమా స్టోరీలా ఉంది. వీడి భార్య‌ను వాడు.. వాడి భార్య‌ను వీడు. అలా అలా ఒక‌టి రెండు జంట‌లు కాదు.. ప‌దులు.. వంద‌లు.. వెయ్యి మంది క‌పుల్స్‌తో పెద్ద ఇల్లీగ‌ల్ నెట్‌వ‌ర్క్ ఏర్పాటు చేశారు. వారంద‌రితో టెలిగ్రామ్‌, మెసెంజ‌ర్ గ్రూపులు క్రియేట్ చేసుకొని ఎఫైర్ పెట్టుకుంటున్నారు. గ్రూపులో డేట్ అండ్ ప్లేస్ ఫిక్స్ చేసుకుంటారు. ఈ జంట‌.. ఆ జంట వెళ‌తారు. ఓ నైట్‌ గ‌డుపుతారు. తెల్లారాక‌ ఎవ‌రి దారిన వారు వెళ్లిపోతారు. అంతా గ‌ప్‌చుప్‌. భ‌ర్త‌కు తెలిసే భార్య ఇంకొక‌రి భ‌ర్త‌తో గ‌డుపుతుంది. భార్య‌కు తెలిసే భ‌ర్త మ‌రొక‌రి భార్య‌తో ప‌ని కానిచ్చేస్తాడు. అంతా ఛీ..చెండాలం. 

గుట్టుచ‌ప్పుడు కాకుండా జ‌రుగుతున్న ఈ భార్య‌ల మార్పిడి య‌వ్వారాన్ని పోలీసులు ఆల‌స్యంగా చేధించారు. ఏడుగురు నిందితుల‌ను అరెస్ట్ చేశారు. ఆ ఇల్లీగ‌ల్ నెట్‌వ‌ర్క్‌లో సంపన్న‌కుటుంబాల జంట‌లే ఎక్కువ‌గా ఉన్న‌ట్టు తెలుస్తోంది. ఈ కా-మ‌పురాణం కేర‌ళ‌లో సంచ‌ల‌నంగా మారింది. 

ఇతరుల భ‌ర్త‌ల‌తో లై*గిక సంబంధం పెట్టుకోవాలని బలవంతం చేస్తున్న భర్తపై ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ బాగోతం బయ‌ట‌ప‌డింది. ఇంతకుముందు కూడా కేర‌ళ‌లోని ప‌లు ప్రాంతాల్లో ఇలాంటి ఘ‌ట‌న‌లు వెలుగుచూశాయి. భార్యల మార్పిడి రాకెట్ కేరళ వ్యాప్తంగా న‌డుస్తున్న‌ట్టు పోలీసులు గుర్తించారు. 

"భార్యలను మార్పిడి చేసుకుంటున్నవారు టెలిగ్రామ్, మెసెంజర్ గ్రూపులలో చేరారు. అలా ఒకరికొకరు కనెక్ట్ అవుతున్నారు. ఫిర్యాదు చేసిన మహిళ భర్తను అదుపులోకి తీసుకున్నాం. ఈ ఇల్లీగ‌ల్ రాకెట్‌ వెనుక చాలామంది పాత్ర ఉందని, ఈ కేసుకు సంబంధించి మరికొంత మంది ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నాం" అని పోలీసులు తెలిపారు. 

కేర‌ళ వ్యాప్తంగా ఉన్న ప‌లువురు ప్ర‌ముఖులు, ఉన్నత వర్గాలకు చెందిన వారు ఈ రాకెట్‌లో భాగమని పోలీసులు నిర్ధారించారు. భార్యల మార్పిడి బాగోతంపై 25 మంది పోలీసుల బృందం దర్యాప్తు చేస్తోంది. త్వరలో  మరింత మంది నిందితులను అరెస్టు చేస్తామని కేరళ పోలీసులు వివరించారు.