అరుదైన రికార్డ్ సొంతం చేసుకున్న ప్రజ్ఞాన్ ఓజా

 

ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగవ టేస్ట్ మ్యాచ్ రెండో రోజు భారత ఎడమచేతి వాటం స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజా అరుదైన రికార్డ్ ను సొంతం చేసుకున్నాడు. ఓజా 22 టెస్టు మ్యాచుల్లో 100వ వికెట్ గా జేమ్స్ పాటిన్సన్ విరాట్ కోహ్లీ అందుకున్న క్యాచ్ ద్వారా అవుట్ చేసి సరికొత్త రికార్డ్ నెలకొల్పాడు. మూడవ భారత ఆటగాడిగా రికార్డులకెక్కాడు. అంతకుముందు ఎర్రపల్లి ప్రసన్న 20 టెస్టులు, భారత స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే 21 టెస్టు మ్యాచుల్లో 100 వికెట్లు తీసినవారిలో ఉన్నారు. ఇండియా తరపున వంద వికెట్లు పడగొట్టిన వారిలో ఓజా 18వ వాడుగా, ప్రపంచ క్రికెట్ చరిత్రలో 163వ ఆటగాడిగా నిలిచాడు. ఎడమచేతి వాటం బౌలర్ గా ఓజా ఇండియా తరపున ఐదవ ఆటగాడు కాగా అంతకుముందు ఇండియా తరపున వంద టేస్ట్ వికెట్లు సాధించిన ఎడమచేతి వాటం స్పిన్ బౌలర్లు బిషన్ సింగ్ బేడీ, వినూ మన్కడ్, రవి శాస్త్రి, దిలిప్ దోషి ఉన్నారు.