TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

పవన్ పదికి ఫిక్స్ అయిపోయారా..?

Published on: Thu Jul 5, 2018 1:15PM

 

వచ్చే ఎన్నికల్లో ఏపీలో త్రిముఖ పోటీ తప్పదని ఇప్పటికే అందరికీ అర్థమైంది.. టీడీపీ, వైసీపీల మధ్యే ప్రధాన పోటీ ఉంటుందని కొందరు అంటుంటే, లేదు జనసేన కూడా గట్టి పోటీ ఇస్తుందని కొందరు అంటున్నారు.. ఇక మరికొందరి అభిప్రాయం వేరేలా ఉంది.. వచ్చే ఎన్నికల్లో ఏపీలో హంగ్ ఏర్పడుతుంది.. దాంతో కర్ణాటకలో తక్కు సీట్లు గెలిచినా, జేడీఎస్ కింగ్ మేకర్ అయినట్టు ఏపీలో జనసేన కింగ్ మేకర్ అయ్యే అవకాశం ఉంది అంటున్నారు.. ఇలా ఎవరేం చెప్పినా ప్రస్తుతానికి ఇవన్నీ అభిప్రాయాలూ, ఊహాగానాలే.. సరే ఇదంతా పక్కన పెడితే.. అసలు వచ్చే ఎన్నికల్లో జనసేన విజయం గురించి పవన్ ఏమనుకుంటున్నారు?.. తాజాగా పవన్ ఈ విషయం గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తుంది.

 'తొలుత జనసేనకు ఒక్క శాతం మాత్రమే ఓటింగ్ ఉందన్నారు.. ఇటీవల సర్వేలో 10 శాతం ఉంటుందని చెప్తున్నారు.. మోడీ, ట్రంప్ లు తొలుత 10 శాతం ఓటింగ్ ను దక్కించుకున్నారు.. తరువాత ఒకరు దేశ ప్రధాని, మరొకరు దేశ అధ్యక్షుడు అయ్యారు.. మేం కూడా జనసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం' అంటూ పవన్ కీలక వ్యాఖ్యలు చేసారు.. అంటే పవన్ వచ్చే ఎన్నికల్లో 10 శాతం ఓటింగ్ సాధించి ఓడిపోయినా, భవిష్యత్తులో మోడీ, ట్రంప్ లాగా అధికారంలోకి వస్తామని పరోక్షంగా చెప్తున్నారా అంటూ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.