TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

వామ్మో.. ఒక్క‌రోజులోనే 10ల‌క్ష‌ల కేసులు.. ఒమిక్రాన్ కుమ్మేస్తోంది..

Published on: Wed Dec 29, 2021 6:48PM

ఒమిక్రాన్‌. మొద‌ట్లో లైట్ తీసుకున్నారంతా. అంత‌లోనే త‌గ్గేదేలే అంటూ కేసుల‌తో కుమ్మేస్తోంది. ఆఫ్రిక‌న్‌, యూర‌ప్‌, అమెరికా కంట్రీస్‌లో పంజా విసురుతోంది. క్రిస్మ‌స్ వేడుక‌లు ఆయా దేశాల కొంప ముంచుతోంది. ఇండియాలోకీ వేగంగా చొచ్చుకొచ్చింది. మ‌న‌దేశంలో అప్పుడే డ‌బుల్ సెంచ‌రీకి ద‌గ్గ‌ర ప‌డింది. తెలుగు రాష్ట్రాల్లోనూ ప‌దుల సంఖ్య‌లో కేసులు బెంబేలెత్తిస్తున్నాయి. భారీగా కొవిడ్ కేసులు వ‌స్తుండ‌టం.. అందులో ఒమిక్రాన్ వేరియంట్ ఎక్కువ‌గా ఉంటుండ‌టం ఆందోళ‌న‌క‌ర ప‌రిణామం.

వ‌ర‌ల్డ్ వైడ్‌గా వరుసగా రెండోరోజు 10 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. సీడీసీ లెక్క‌ల ప్రకారం.. కరోనా కొత్త కేసుల్లో 58.6 శాతం ఒమిక్రాన్‌ వేరియంట్ కేసులే ఉన్నాయి. ఫ్రాన్స్‌లో మునుపెన్నడూ లేని విధంగా ఏకంగా 1,79,807 కేసులు న‌మోద‌య్యాయి. ఫ్రాన్స్‌తో పాటు ఇటలీ, గ్రీస్‌, పోర్చుగల్, ఇంగ్లండ్‌లో కూడా రికార్డు స్థాయిలో కేసులు వ‌స్తున్నాయి. 

బ్రిటన్‌లో 1,29,471 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. ప్రజలంతా కొవిడ్ నియమావళిని పాటిస్తూ.. కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలకాలని బ్రిటన్ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ఒకవేళ వైద్య వ్యవస్థ కుప్ప కూలిపోయేదశకు చేరుకుంటే.. ఆంక్షలను కఠినతరం చేస్తామని హెచ్చరించింది. 

 అమెరికాలో రికార్డు స్థాయిలో 4,41,278 కేసులు న‌మోద‌య్యాయి. ఐసోలేషన్, క్వారంటైన్ సమయాన్ని 10 రోజుల నుంచి ఐదు రోజులకు యూఎస్ స‌ర్కారు తగ్గించడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. కరోనా నెగెటివ్‌ వచ్చిందో, లేదో పట్టించుకోకుండా ప్రజలు ఐసోలేషన్‌ నుంచి బయటకు వచ్చే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.   

10 ల‌క్ష‌ల కేసులు న‌మోదు అవ‌డంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. ఒమిక్రాన్‌తో తీవ్ర ముప్పు పొంచి ఉందని, వైద్య వ్యవస్థలను ముంచెత్తుతుందని హెచ్చరించింది. వ్యాప్తిని నివారించేందుకు కఠినచర్యలు చేపట్టాలని సూచించింది. ఎలాంటి వార్నింగ్‌లు ప‌ట్టించుకోకుండా.. క్రిస్మ‌స్‌, ఇయ‌ర్ ఎండింగ్ హాలిడేస్‌తో ఎంజాయ్ చేస్తున్న యూర‌ప్‌, అమెరికా దేశ‌స్తులు ఒమిక్రాన్ వ్యాప్తికి సూప‌ర్ స్పెడ‌ర్స్‌గా మారుతున్నారు.