TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

బతుకమ్మ ఉత్సవాలకు 10 కోట్లు విడుదల

Published on: Sun Sep 14, 2014 1:49PM

 

తెలంగాణ రాష్ట్ర పండుగ బతుకమ్మ ఉత్సవాల వేడుకను వైభవంగా నిర్వహించేందుకు తెలంగాణ సర్కారు 10 కోట్ల రూపాయలను విడుదల చేసింది. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ ఉత్సవం. తెలంగాణలోని ప్రతి జిల్లా కేంద్రాలు, గ్రామాల్లో బతుకమ్మ ఉత్సవాల ఏర్పాటుకై శాఖల మధ్య సమన్వయం కోసం సమావేశాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. అక్టోబర్ 2న జరిగే బతుకమ్మ ఉత్సవాల ఏర్పాట్లు పూర్తి ఈనెల 29 లోగానే చేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను, అధికారులను సూచించింది. ఈ వేడుకలలో ఎటువంటి అపశ్రుతి దొర్లకుండా పటిష్ట పోలీసు బందోబస్తు కల్పించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.