TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

‘1 నేనొక్కడినే’ మహేష్ స్పీచ్ అదిరింది

Published on: Fri Dec 20, 2013 11:36AM

 

 1 Nenokkadine songs,  one Nenokkadine songs, mahesh 1 Nenokkadine audio songs,  mahesh one Nenokkadine audio, mahesh 1 Nenokkadine

 

 

టాలీవుడ్ సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు నటించిన ‘1 నేనొక్కడినే’ ఆడియో ఫంక్షన్ శిల్పా కళా వేదికలో సినిమా యూనిట్, అభిమానుల మధ్య పండగలాగ జరిగింది. సాధారణంగా మహేష్ ఏ ఫంక్షన్ లలోనైనా నాలుగు ముక్కలు కంటే ఎక్కువగా మాట్లాడారు. కాని ‘1 నేనొక్కడినే’ ఆడియో వేడుకలో మాత్రం మహేష్ ఇచ్చిన స్పీచ్ హైలైట్ గా నిలిచింది.

 

''దేవితో సినిమా చేయాలని చాలాసార్లు అనుకున్నాం. కొన్ని కారణాల వల్ల వీలు కాలేదు. ఈసారి సుకుమార్ గారి కాంబినేషన్లో దేవితో పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా ద్వారా మా అబ్బాయి గౌతమ్ నటుడిగా పరిచయమవుతున్నాడు. ఇది నాకెంతో ఆనందాన్ని కలిగిస్తున్న అంశం. నా కంటే తానే బాగా చేశానని వాడి ఫీలింగ్. ఏదిఏమైనా ఆ అనుభూతి మాటల్లో చెప్పలేనిది. నా సినిమాల్లోకెల్లా ఇది గొప్ప చిత్రం. నా ప్రయత్నాలను ఆదరిస్తున్న అభిమానుల రుణం ఏమిచ్చినా తీర్చుకోలేను. చేతులెత్తి నమస్కరించడం తప్ప” అని ప్రిన్స్ మహేష్ బాబు అన్నారు.