TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మహేష్ బాబు ‘1 నేనొక్కడినే’ ఆడియో విశేషాలు

Published on: Thu Dec 19, 2013 7:57PM

 

 

 

తెలుగు సినీ ప్రేక్షకులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సూపర్ స్టార్ మహేష్ బాబు ‘1 నేనొక్కడినే’ ఆడియో ఫంక్షన్ శిల్పా కళా వేదికలో అభిమానుల మధ్య కోలాహలంగా జరుగుతుంది. సూపర్ కృష్ణ ఈ ఆడియో వేడుకకు స్పెషల్ గెస్ట్ గా వచ్చారు. ప్రిన్స్ మహేష్ బాబు తన సతీమణి నమ్రతా, కుమారుడు గౌతమ్ తో కలిసి ఆడియోకి వచ్చారు.


సూపర్ స్టార్ కృష్ణ మాట్లాడుతూ...1 నేనొక్కడినే’ విడుదలకి ముందే మంచి హైప్ వచ్చింది. అలాగే మంచి బిజినెస్ కూడా చేసిందని అంటున్నారు. ఈ సినిమా మా మహేష్ కేరియార్ లోనే పెద్ద హిట్ గా నిలుస్తుంది.


సుకుమార్‌ డైరెక్ట్‌ చేసిన అన్ని సినిమాలకీ సాంగ్స్‌ కంపోజ్‌ చేసిన దేవిశ్రీప్రసాద్‌ ‘1 నేనొక్కడినే’కి కూడా సూపర్‌హిట్‌ మ్యూజిక్‌ అందించాడు. అన్ని పాటల వన్‌ మినిట్‌ ప్రోమోస్‌ని బట్టి మ్యూజికల్‌ హిట్‌ ఖాయమని తేలింది. దేవిశ్రీప్రసాద్‌ రొటీన్‌కి భిన్నమైన సాంగ్స్‌ అందించే ప్రయత్నం చేశాడు.ఆడియో రిలీజ్‌ అయిన దగ్గర్నుంచి కొంత కాలం పాటు 1 పాటలే అంతటా మార్మోగడం ఖాయం చేసుకోవచ్చు.