జగన్ ఎమ్మెల్యేల సస్పెన్షన్..అరెస్ట్

 

 

 

వైకాపా ఎమ్మెల్యేలు శాసన సభ నుంచి సస్పెండయ్యారు. ఐదు రోజులుగా అసెంబ్లీకి తీవ్ర ఆటంకం కలిగిస్తున్న ఆ పార్టీ ఎమ్మెల్యేల్ని ఒకరోజు పాటు సభ నుంచి సస్పెండ్ చేశారు. శాసన సభ వ్యవహారాల మంత్రి శైలజానాథ్ వీరి సస్పెన్షన్ తీర్మానాన్ని ప్రవేశ పెట్టగా స్పీకర్ ఆమోదం తెలిపి.. 15 మంది ఎమ్మెల్యేల్ని సభ నుంచి బయటికి వెళ్లాల్సిందిగా కోరారు. ఐతే ఎమ్మెల్యేలు నినాదాలు చేస్తూ అక్కడే ఉండటంతో మార్షల్స్ వారిని బలవంతంగా బయటికి పంపారు. ఐతే సస్పెండ్ చేసిన సభ్యుల్లో పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ లేదు. తమ సభ్యులందరినీ బయటికి పంపేయడంతో విజయమ్మ ఒంటరి అయిపోయారు. మంత్రి వట్టి వసంతకుమార్ మాట్లాడుతుండగా విజయమ్మ లేచి.. సమైక్య తీర్మానం చేయనందుకు నిరసనగా తాను వాకౌట్ చేస్తున్నట్లు చెప్పి.. బయటకు వెళ్లిపోయారు.

 

అనంతరం ఎమ్మెల్యేలు అసెంబ్లీ గేట్ నెంబర్ 1 వద్ద ఆందోళన చేపట్టారు. వారిని పోలీసులు అరెస్టు చేశారు. కాగా, శాసన మండలిలో ఆ పార్టీ ఎమ్మెల్సీలను కూడా సస్పెండ్ చేశారు.