బ్రదర్ అనిల్ రెండో మ్యారేజ్..బైబిల్‌ను ధిక్కరించాడా?

 

 

ys sharmila, brother anil ysr congress, jagan anil, ys sharmila brother anil

 

 

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరి షర్మిలా భర్త బ్రదర్ అనిల్ కుమార్ కు కొత్త చిక్కులు వచ్చిపడుతున్నాయి. తాజాగా బ్రదర్ అనిల్ వ్యవహారం క్రైస్తవులకు తలనొప్పిగా మారిందని తెలంగాణ క్రైస్తవ సంఘాల అధ్యక్షుడు మట్టయ్య విమర్శించాడు. క్రైస్తవ ప్రచారం చేస్తున్న అనిల్ స్వయంగా బైబిల్ ను దిక్కరించాడని అన్నారు. బైబిల్ వ్యాఖ్య ప్రకారం ఏ వ్యక్తి తన భార్య బతికి ఉండగా రెండో పెళ్ళి చేసుకోకూడదని, అనిల్ రెండో పెళ్ళి చేసుకున్నారని ఆరోపించారు.


రక్షణ టీవి, మణికొండ చర్చి స్థలాలను తెలంగాణకు చెందిన పేద క్రైస్తవులకు అప్పగించాలని డిమాండ్ చేశారు. వైయస్ రాజశేఖర రెడ్డి కుటుంబం అవినీతి, అక్రమాస్తులు, హెలికాఫ్టర్‌ కుంభకోణం, బయ్యారం, మణికొండలో దళితులు, బీసీల భూముల కబ్జా, క్రైస్తవ ఛానల్‌ రక్షణ టీవిని అవినీతి డబ్బుతో నడిపిస్తున్నారని తెలిసి క్రైస్తవులు సిగ్గుతో తలదించుకునే పరిస్థితి ఏర్పడిందని అన్నారు.