TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

9 అంటేనే భయపడుతున్న జగన్?

Published on: Thu May 31, 2012 10:45AM

వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహనరెడ్డి 9 అనే సంఖ్యకు ఓ లింకు ఉందని ఇటీవల ఆయన సన్నిహితులు గుర్తించారు. 2009 సెప్టెంబర్ లో సిఎంగా ఉన్న వై.ఎస్.రాజశేఖరా రెడ్డి మరణించారు. అంటే 2009లో తొమ్మిదో నెల అన్నమాట. ఈ ఏడాది మె 9వ తేదీన ప్రభుత్వం సాఖికి ప్రకటనలను నిలిపివేస్తూ జీ.ఓ.జారీ చేసింది. ఇదే నెల 18వ తేదీన సాక్షి ఆస్తుల అటాచ్ మెంట్ జీ.ఓ. కూడా జారీ అయింది. అంటే 1ని 8తో కూడితే సంఖ్యాపరంగా తొమ్మిదే అన్నమాట. సిబీఐ జగన్ ను అరెస్టు చేసింది మె 27వ తేదీన. అంటే ఆ రెండు అంకెలను కలిపినా తొమ్మిదే వస్తుంది. చెంచల్ గూడ జేలులో జగన్ కు కేటాయించిన నెంబర్ 6093. దీన్ని కలిపితే 18 అవుతుంది. దాన్ని కలిపితే 9 వస్తుంది. ఈ 9 అంకె గురించి జగన్ ఎంత కలవరపడుతారంటే సాక్షి భవనంలో 8వ అంతస్తు తరువాత దాన్ని పదో అంతస్తుగా పిలుస్తారట. వచ్చే ఉప ఎన్నికలు 18 అసెంబ్లీ స్థానాల్లో వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. అంటే అదీ చివరికి 9 అంకెనే సూచిస్తోంది.