ఎర్రన్నాయుడు అంతక్రియలు ప్రారంభం
Published on: Sat Nov 3, 2012 12:29PM
.jpg)
టీడీపీ వ్యవస్థాపక సభ్యుడు ఎర్రన్నాయుడు అంతిమయాత్ర కన్నీటి మధ్య శనివారం ఉదయం ప్రారంభమైంది. నిమ్మాడలోని ఇంటి వద్ద నుంచి ఆశేష ప్రజానీకం మధ్య అంతిమయాత్ర కొనసాగుతోంది. అంతిమ యాత్రలో పార్టీ అధినేత చంద్రబాబునాయుడు, లోకేష్, పలువురు రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు.
ఎర్రన్నాయుడు పార్థివదేహం ఉన్న వాహనంలో చంద్రబాబు స్మశాన వాటికకు వెళ్లారు. జననేత కడసారి చూపు కోసం భారీగా అభిమానులు, కార్యకర్తలు తరలివస్తున్నారు. అధికార లాంఛనాలతో ఎర్రన్నాయుడు అంత్యక్రియలు జరగనున్నాయి. నిమ్మాడలోని వ్యవసాయ క్షేత్రంలో ఎర్రన్నాయుడు అంత్యక్రియలు జరుగుతాయి.


