యాంటీ ర్యాగింగ్ స్క్వాడ్‌ పై విమర్శలు... వారిని వేధించవద్దు..

 

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా యోగి అధిత్యనాథ్ బాధ్యతలు చేపట్టిన దగ్గర నుండి పార్టీ ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మహిళలకు రక్షణగా.. ఆకతాయిలకు చెక్ పెట్టేందుకు గాను యాంటీ రోమియో టీమ్ లను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇక్కడివరకూ బాగానే దీనిపై విమర్శలు వినిపిస్తున్నాయి. రోమియో స్క్వాడ్‌లతో ఆకతాయిలకు చెక్‌ పెట్టేడం బాగానే ఉంది కానీ... పోలీసులు కాస్త దురుసుగా ప్రవర్తిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. దీంతో ఈ విమర్శలపై స్పందించిన యోగి..యాంటీ ర్యాగింగ్ స్క్వాడ్‌ సిబ్బంది.. అమాయక యువత, జంటలపై వేధింపులకు పాల్పడవద్దని పోలీసులకు సూచించారు. ఈ మేరకు యూపీ శాంతిభద్రతల అదనపు డీజీ దల్జీత్‌ చౌదరి అమాయకులను వేధించే సిబ్బందిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.