పోలీసులకు ఝలక్ ఇచ్చిన యూపీ సీఎం...
Published on: Thu Mar 23, 2017 4:39PM

ఉత్తరప్రదేశ్ సీఎంగా యోగి ఆదిత్యనాథ్ బాధ్యతలు చేపట్టిన దగ్గర నుండి తను ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ తనదైన ముద్ర వేస్తూ ముందుకు సాగుతున్నారు. ఇప్పటికే ప్రభుత్వ కార్యాలయాల్లో పాన్, గుట్కా నిషేధించి సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో ఆయన పోలీసులకు ఝలక్ ఇచ్చారు. ఈరోజు లక్నోలోని హజ్రత్ గంజ్ పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండానే సీఎం స్టేషన్ కు రావడంతో పోలీసులు పరుగులు పెట్టారు. పోలీస్ స్టేషన్ లోని రికార్డులు, మినీ సెల్స్, లాకప్ సౌకర్యాలను ముఖ్యమంత్రి పరిశీలించారు. ‘ఇది మొదటి ఆడిట్. చివరి ఆడిట్ మాత్రం కాదు’ అని ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. న్యాయాన్ని కాపాడేందుకు పోలీసులు అండగా నిలబడాలని ఆయన కోరారు.


