యోగి ఆధిత్యనాథ్ మరో నిర్ణయం.. పోకిరీలకు చెక్..
Published on: Wed Mar 22, 2017 3:43PM

యూపీ సీఎం గా బాధ్యతలు చేపట్టిన యోగి ఆధిత్యనాథ్ తను మార్క్ ను అప్పుడే చూపెడుతున్నారు. ఇప్పటికే అనైతిక కార్యకలాపాలకు పాల్పడుతున్న హోటళ్లపై దాడులు జరిపించి సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా మరో నిర్ణయం తీసుకున్నారు. బీజేపీ ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగానే ఈవ్ టీజింగ్ కు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకునే విధంగా ఆదేశాలు జారీ చేశారు. ఈవ్ టీజింగ్ వ్యతిరేక బృందాలు ఏర్పాటు చేశారు. లక్నో జోన్ పరిధిలోని 11 జిల్లాల్లో ఈ బృందాలు ఏర్పాటు చేయాలని ఉన్నతాధికారులకు ఆదేశాలు చేశారు. ప్రతి జిల్లాల్లోనూ యాంటి ఈవ్ టీజింగ్ టీమ్స్ ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. విద్యార్థినులను వేధించే పోకిరీలను అదుపులోకి తీసుకునేందుకు ఈ టీమ్స్ కాలేజీలు, పాఠశాలల సమీపంలోనూ ఉంటాయని... ఇప్పటికే ఐదుగురు పోకిరీలను అరెస్టు చేశామని తెలిపారు.


