TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

జగన్ వద్దు.. కాంగ్రెస్ ముద్దు.. కాంగ్రెస్ వైపు వైసీపీ సీనియర్ల చూపు?

Published on: Sat Jul 4, 2026 10:32AM

జగన్ ఏకపక్ష నిర్ణయాలు. ఒంటెత్తు పోకడల పట్ల వైసీపీలో తీవ్ర అసంతప్తి వ్యక్తం అవుతోంది. దీంతో ఆ పార్టీ కీలక నేతలు రహస్య భేటీలు నిర్వహించుకుని తమ భవిష్యత్ కార్యాచరణపై చర్చలు జరుపుతున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో వైసీపీలో అంతర్గత సంక్షోభం  అంతర్గత సంక్షోభం ముదురుతోంది. గత ఎన్నికల ఘోర పరాజయం తర్వాత కూడా జగన్ తన తీరు మార్చుకోకుండా పాత పద్ధతులనే అవలంబిస్తుండటంపై వైసీపీ సీనియర్ నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని పార్టీ శ్రేణులే చెబుతున్నాయి.  

2014 నుండి 2019 మధ్య కాలంలో జగన్  రాజకీయ వ్యూహాలు అప్పట్లో సత్ఫలితాలను ఇచ్చాయి. కానీ 2019లో అధికారం చేపట్టిన తరువాత జగన్ తీసుకున్న నిర్ణయాలు, అవలంబించిన విధానాల కారణంగా ప్రజలలో తీవ్ర అసంతృప్తి, వ్యతిరేకత వచ్చింది. ఫలితంగా 2024 ఎన్నికలలో వైసీపీ ఘోర పరాజయం పాలైంది. కనీసం ప్రతిపక్ష హోదాకు కూడా అర్హత లేదని కేవలం 11 స్థానాలలోనే విజయాన్ని కట్టబెట్టిన ప్రజా తీర్పు విస్పష్టంగా తేల్చి చెప్పింది.  ఇప్పడు కూడా జగన్ తన పాత పద్ధతిని మార్చుకోకుండా తీసుకుంటున్న నిర్ణయాలు, చేస్తున్న ప్రకటనలు తమ రాజకీయ భవిష్యత్ ను ప్రశ్నార్థకంగా మార్చేస్తున్నాయన్న ఆందోళన, అసంతృప్తీ పార్టీ నేతలలో గూడుకట్టుకుంది. 

గత అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ కేవలం 11 స్థానాలకే పరిమితమై అధికారానికి దూరమవ్వడమే కాకుండా, కనీసం ప్రతిపక్ష హోదాకు కూడా నోచుకోని సంగతి తెలిసిందే. అంతటి  ఘోర పరాభవం ఎదురైనా జగన్ తీరులో మార్పు రాలేదన్న అసంతృప్తి వైసీపీ నేతలలో ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. . పార్టీని   బలోపేతం చేసేందుకు పటిష్టమైన చర్యలు తీసుకోకపోగా..  క్షేత్రస్థాయి నుంచి వస్తున్న ఫీడ్‌బ్యాక్‌ను కూడా జగన్ పట్టించుకోవడం లేదని సొంత పార్టీ నేతల నుంచే కాకుండా శ్రేణుల నుంచి కూడా ఆరోపణలు వెల్లువెత్తుతన్నాయి.  

జగన్  ఏకపక్ష నిర్ణయాల వల్ల తాము రాజకీయంగా  నష్టపోతున్నామని పలువురు మాజీ మంత్రులు, సీనియర్ నేతలు అంతర్గత సంభాషణల్లో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా వచ్చే ఎన్నికలలో పార్టీ అజెండా మావిగన్ అని జగన్ ప్రకటన చేసిన తరువాత..  వైసీపీ సీనియర్లలో నిరాశా, నిస్ఫృహలు నెలకొన్నాయని పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. 
ఇంకా జగన్ తోనే ఉంటే.. రాజకీయ భవిష్యత్ శూన్యం అన్న భావన వారిలో ప్రస్ఫుటంగా వ్యక్తమౌతోంది.

ఈ కారణంగానే వైసీపీకి చెందిన కొందరు సీనియర్, కీలక నేతలు ఇటీవలి కాలంలో రహస్య సమావేశాలు ఏర్పాటు చేసుకుని మరీ భవిష్యత్ కార్యాచరణపై చర్చించుకుంటున్నట్లు ఏపీ రాజకీయవర్గాలలో గట్టిగా వినిపిస్తోంది.  పార్టీ భవిష్యత్తు, తమరాజకీయ భవిష్యత్ పై కేవలం చర్చలకే పరిమితం కావడమే కాకుండా..  ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ అగ్రనేతలతో కూడా   చర్చలు జరుపుతున్నట్లు వైసీపీ వర్గాలే చెబుతున్నాయి. జగన్ సోదరి,  వైఎస్ షర్మిల ఏపీ కాంగ్రెస్  అధ్యక్షురాలు కావడంతో వైసీపీలోని వైఎస్ రాజశేరరెడ్డి అనుయాయులు, అభిమానులు ఆమెతో ఇటీవలి కాలంలో నిరంతరం టచ్ లో ఉంటున్నట్లు చెబుతున్నారు. జగన్ తీరు ఇలాగే ఉంటే.. సమీప భవిష్యత్ లోనే పలువురు కీలక వైసీపీ నేతలు హస్తం గూటికి చేరే అవకాశాలు మెండుగా ఉన్నాయని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు. 

YSRCP Crisis, YS Jagan, Secret Meetings, AP Congress, YS Sharmila, AP Politics, Teluguone