ఉగ్రవాది యాసిన్ భత్కల్ అరెస్ట్

Publish Date:Aug 29, 2013

Advertisement

 

 

 

ఇండియన్ ముజాహిదీన్ వ్యవస్థాపకుడు,కరుడుగట్టిన ఉగ్రవాది యాసిన్ భత్కల్ నేపాల్ సరిహద్దులో అరెస్ట్ అయ్యాడు. హైదరాబాద్ దిల్‌సుఖనగర్‌లో జరిగిన రెండు జంట పేలుళ్ల కేసులో భత్కల్ సూత్రధారి. ఇటీవల అరెస్టైన అబ్దుల్ కరీం అలియాస్ తుండ ఇచ్చిన సమాచారంతో ఎన్ఐఏ అధికారులు భత్కల్‌ను అరెస్ట్ చేశారు.


బెంగళూరు, పుణే, ఢిల్లీ, నాగపూర్ తదితర నగరాల్లో పేలుళ్లలో ఇతని పాత్ర ఉంది. ఇతని పైన రూ.20 లక్షల రివార్డ్ ఉంది. భత్కల్‌తో పాటు మరో ఉగ్రవాది అసదుల్లా అక్తర్‌ను కూడా ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. పాకిస్థాన్‌లోని లష్కరే తయ్యాబాతో భత్కల్‌కు సంబంధాలున్నాయని పోలీసులు చెబుతున్నారు. ఉగ్రవాది యాసిన్ భత్కల్ అరెస్ట్‌ను కేంద్ర హోంశాఖ ధృవీకరించింది.