TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

పండుగ తర్వాతే పార్టీ మారడం: జె.సి. ప్రభాకర్ రెడ్డి

Published on: Tue Dec 24, 2013 2:39PM

 

 

 

కాంగ్రెస్ తో దశాబ్దాల అనుబంధం ఉన్న జెసి కుటుంబం పార్టీ మారడం దాదాపు ఖాయమైనట్టే. మంగళవారం మీడియాతో మాట్లాడిన జెసి దివాకర్ రెడ్డి సోదరుడు జెసి ప్రభాకర్ రెడ్డి చెప్పిన విషయాలు దీన్ని ధృవీకరిస్తున్నాయి. తను తెలుగుదేశంలో చేరతానని, తన అన్న వైసిపీలో చేరతారని వచ్చిన వార్తలను ఆయన తోసిపుచ్చుతూ, పండుగ తర్వాత తాము చేరబోయే పార్టీ విషయం ప్రకటిస్తామన్నారు. ఏ విషయంలోనైనా తమ కుటుంబం మొత్తం ఒకతాటి మీద ఉంటామని, అలాగే పార్టీ మారితే అందరం ఒకే పార్టీలోకి వెళతామని ఆయన చెప్పారు.