పశ్చిమ బెంగాల్.. వంతెన కూలి 65 మంది గల్లంతు..
Published on: Wed Apr 26, 2017 4:02PM

పశ్చిమ బెంగాల్ లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. పశ్చిమ బెంగాల్ లోని హుగ్లీ జిల్లాలో భంద్రేశ్వర్ ప్రాంతంలో ఈ ఘటన సంభవించింది. ఓడల్లోకి ఎక్కేందుకు నిర్మించిన చెక్క వంతెన (జెట్టీ) ప్రమాదవశాత్తు కూలిపోవడంతో ముగ్గురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. మరో 65 మంది గల్లంతయ్యారు. సముద్రంలోని భారీ అలల కారణంగానే వంతెన కూలిపోయిందని అధికారులు తెలిపారు. ఘటన జరిగిన వెంటనే ప్రమాద స్థలికి చేరుకున్న పోలీసులు... సహాయక చర్యలను చేపట్టారు.


