ముంబైలో ‘ఎనీ టైమ్ వాటర్’ మిషన్లు

 

సాధారణంగా డబ్బు విత్ డ్రా చేసుకునే ఏటీఎంలు ప్రపంచంలో ఎక్కడైనా కనిపిస్తాయి. అయితే కాయిన్ వేసీ నీళ్ళు పట్టుకునే ఏటీఎంలను (వీటిని ఆక్వీటీఎం అని పిలుస్తున్నారు) ముంబైలో ఏర్పాటు చేశారు. ఈ మిషన్లలో రూపాయి కాయిన్ వేస్తే లీటర్ మంచి నీటిని విడుదల చేస్తుంది. వందనా ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థ ఈ ఎక్వాటీఎంలను ఏర్పాటు చేసింది. ముంబైలోని అనేక ప్రాంతాలలో ఈ ఎక్వాటీఎంలను ఏర్పాటు చేశారు. ఈ మిషన్లకు ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. ఒక్కో మిషన్ నుంచి రోజుకు దాదాపు మూడు వందల లీటర్ల నీటిని జనం ‘విత్‌డ్రా’ చేసుకుని వెళ్తున్నారు.