TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

ఏపీ రాజధానిపై కూచిపూడి బ్రిడ్జ్..

Published on: Thu Mar 9, 2017 12:02PM

 

రాజధాని అమరావతిపై కూచిపూడి బ్రిడ్జ్ నిర్మించనున్నారు. కూచిపూడి బ్రిడ్జ్ ఏంటని అనుకుంటున్నారా..? అసలు సంగతేంటంటే... అమరావతిని విజయవాడ-హైదరాబాద్‌ జాతీయ రహదారితో అనుసంధానిస్తూ కృష్ణానదిపై రెండంతస్తుల ఐకానిక్‌ బ్రిడ్జి నిర్మించాలని నిర్ణయించారు. అయితే ఈ బ్రిడ్జ్ ఆకారం  కూచిపూడి నృత్య భంగిమను పోలి ఉంటుంది. ఈ బ్రిడ్జ్ నిర్మాణానికి గాను ఎల్‌ అండ్‌ టీ సంస్థ రూపొందించిన ఆరు ఆకృతుల్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిశీలించగా.. ఆయనకు కూచిపూడి భంగిమను పోలిన ఆకృతి నచ్చిందట. దీనితో పాటు మరో ఆకృతి కూడా ఆయనకు నచ్చినట్టు తెలుస్తోంది. అది.. పుష్పాన్ని పోలినట్లుగా రెండంతస్తులతో రూపొందించిన ఆకృతి. ఈ రెండు ఆకృతుల మేళవింపుగా బ్రిడ్జ్ ఉండాలని చంద్రబాబు సూచించారట. రాజధాని అమరావతిలో ప్రవేశించేందుకు కృష్ణానదిపై నిర్మించే మొదటి వారధి కాబట్టి దీన్ని అద్భుతంగా, ప్రతిష్ఠాత్మకంగా కట్టాలని...జలక్రీడలకు అనువుగా బ్రిడ్జి నిర్మించే ప్రాంతంలో నదిలో దీవులు ఏర్పాటు చేయవచ్చన్నారు. కన్యాకుమారి తరహాలో వారధి పైభాగం సూర్యోదయ వీక్షణకు వీలుగా వ్యూపాయింట్‌గా నిలిచిపోవాలని తెలిపారు.

 

కాగా 3.8 కి.మీ పొడవు ఉండే బ్రిడ్జ్..ఇటు రాజధాని అమరావతి వైపు మొదలై, అటు కృష్ణా జిల్లాలోని మూలపాడు వరకు ఉంటుంది. ఈ బ్రిడ్జ్ నిర్మాణానికి దాదాపు రూ.800 కోట్లు అవ్వచ్చని అంచనా.