రాజకీయ భవిష్యత్తు కోసమే చిరు రిజైన్!

 

Chiranjeevi resigns, Union minister Chiranjeevi resigns,  Chiranjeevi, Samaikyandhra stir turns violent, teloangana note

 

 

కేంద్రమంత్రి చిరంజీవి సమైక్యాంధ్రకు మద్దతుగా రాజీనామా చేసినట్లుగా లేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. సీమాంద్రలో ఎదురవుతున్న పరిస్థితులను బట్టి ఆయన కూడా రాజీనామా చేయక తప్పని పరిస్థితి ఎదురైంది. ఎందుకంటే ఇప్పటికయినా రాజీనామాలు చేయకపోతే తాను ప్రజలలోకి వెళ్ళలేనని అందుకనే రాజీనామా చేసినట్లు ఆయన ప్రకటించారు.

 

చిరంజీవి ఇంట్లో మంత్రుల భేటి తరువాత మీడియా తో మాట్లాడుతూ..రాజీనామాలను ఆమోదిస్తే తప్ప ప్రజల్లోకి వెళ్లలేమని ప్రధానికి చెప్పామని, వాటిని ఆమోదించాలని ఒత్తిడి చేశామని చిరంజీవి అన్నారు. రాజీనామాలను ఆమోదించిన తర్వాతే కేంద్రం, అధిష్ఠానం ఇచ్చే అవకాశాలను సద్వినియోగం చేసుకుంటామని, ప్రజల వాణిని వినిపిస్తామని షిండేకు చెప్పామన్నారు. అంటే రాజీనామాలు ఆమోదించిన తర్వాత కొత్త బాధ్యతలు ఇస్తారని చిరంజీవి అనుకుంటున్నారా? లేక మరేదైనా ఉద్దేశం ఉందా అన్నది తెలియాల్సి ఉంది.  

 


ఇదంతా గమనిస్తే మంత్రులు కేవలం ఏపీ యన్జీవోల ఒత్తిడి కారణంగానే ఇప్పుడు రాజీనామాలు చేసి తమ రాజకీయ జీవితాన్నికాపాడుకొనేందుకే ప్రయత్నిస్తున్నారు తప్ప నిజంగా రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలనే చిత్తశుద్దితో లేదా రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వ్యతిరేఖిస్తోనో కాదని స్పష్టం అవుతోంది.