TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఆరు నెలల్లో ఆ పని చేయకుంటే.. భవిష్యవాణి హెచ్చరిక!?

Published on: Mon Aug 3, 2026 2:39PM

సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాల్లో  రంగం భవిష్యవాణి కార్యక్రమం భక్తిశ్రద్ధల మధ్య పూర్తయ్యింది. పచ్చికుండపై నిలబడి మాతంగి స్వర్ణలత అమ్మవారి ఆవాహనతో భవిష్యవాణి వినిపించారు. ఈ ఏడాది రాష్ట్ర ప్రజలకు, సమాజానికి సంభవించే పరిణామాలను వివరిస్తూ  హెచ్చరికలు జారీ చేశారు.

భవిష్యవాణి వినిపిస్తూ..  ప్రారంభంలోనే  తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన స్వర్ణలతను ఆవహించిన అమ్మవారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏడేళ్లుగా తనకు ఇస్తున్న హామీలను నిర్వాహకులు  నెరవేర్చడంలేదన్నారు.  చెప్పిన సమయానికి విగ్రహ ప్రతిష్టాపన ఎందుకు పూర్తి చేయడం లేదని నిలదీశారు. తన ఆగ్రహానికి గురికాకముందే ఇచ్చిన మాటను వెంటనే నెరవేర్చాలని హెచ్చరించారు.  భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తున్నప్పటికీ..  మాట తప్పడం సరికాదన్నారు. 

రానున్న రోజులలో భారీ ప్రకృతి వైపరీత్యాలు సంభవించే అవకాశం ఉందని భవిష్యవాణి హెచ్చరించింది.  ఈ ఏడాది ఊహించని రీతిలో కుంభవృష్టి  కురుస్తుందనీ.. తద్వారావచ్చే వరద ఉధృతి కారణంగా భారీ ఆస్తి, ప్రణనష్టం సంభవిస్తుందనీ చెప్పారు. అలాగే భారీ అగ్నప్రమాదాలు సంభవిస్తాయన్నారు.  

 సమాజంలో మారుతున్న పరిస్థితులు, యువత ప్రవర్తన పట్ల అమ్మవారు  భవిష్యవాణి ద్వారా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.  అలాగే..  తనను నమ్ముకున్న భక్తులను, పిల్లలను ఏ ఆపద రానివ్వకుండా కాపాడుకుంటానని   అభయం ఇచ్చారు. చేసిన తప్పులను దిద్దుకుని శాంతి పరిహార పూజలు నిర్వహించాలని సూచించారు. ని రాబోయే ఆరు నెలలలో  విగ్రహ ప్రతిష్టాపన పూర్తి చేయాలని ని  గడువు విధించారు. 
 

Ujjaini Mahankali Bonalu Rangam,  Bhavishyavani, TeluguOne,  Secunderabad Mahankali Rangam, Swarnalatha Bhavishyavani,  Telangana Bonalu