TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

టీవీ నటుడు లోబోకు ఏడాది జైలు శిక్ష

Published on: Fri Aug 29, 2025 1:57PM

టీవీ నటుడు లోబోకు ఏడాది  జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు వెల్లడించింది. 2018 టీవీ నటుడు లోబో,  అతని టీమ్  2018 లో వీడియో చిత్రీకరణలో భాగంగా వరంగల్ కు వెళ్లారు. అక్కడ రామప్ప, లక్నవరం, భద్రకాళి చెరువు ప్రాంతాల్లో పర్య టించి వీడియోలు చిత్రీకరించారు. చిత్రీకరణ పూర్త యిన అనంతరం అదే సంవత్సరం మే 21వ తేదీన లోబో టీమ్ మొత్తం కారులో అత్యంత వేగంగా వరంగల్ నుండి హైదరాబాద్ కు వస్తుండగా యాక్సిడెంట్ చేశారు.

వారు ప్రయాణిస్తున్న కారు  రఘు నాథ్ పల్లి మండలం నిడిగొండ గ్రామం వద్ద  ఆటోని ఢీ కొంది. ఈ ప్రమా దంలో ఇద్దరు వ్యక్తులు సంఘటనా స్థలంలోనే మరణించారు. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసిన  రఘునాథపల్లి పోలీసులు ఈ కేసు విచారించిన జనగామ జిల్లా కోర్టుకు సక్ష్యాలు సమర్పించారు. కోర్టు ఇరు పక్షాల వాదనలూ విన్నతరువాత  లోబోకు ఏడాది జైలు శిక్షతో పాటు 12,500 జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించింది.