టీ జేఏసీ పోలవరం పోరాటం
Published on: Sat Jun 28, 2014 3:50PM

తెలంగాణ పొలిటికల్ జేఏసీ ఇప్పుడు పోలవరం పోరాటాన్ని మొదలుపెట్టింది. పోలవరం ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్లో కలుపుతూ కేంద్రం జారీ చేసిన ఆర్డినెన్స్ను తక్షణమే వెనక్కి తీసుకోవాలని తెలంగాణ పొలిటికల్ జేఏసీ ఛైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ డిమాండ్ చేశారు. వచ్చేనెల రెండోవారంలో ఆర్డినెన్స్కు వ్యతిరేకంగా ఢిల్లీలో సదస్సు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఇదే అంశంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలసి వినతిపత్రం సమర్పిస్తామని కోదండరామ్ తెలిపారు. ఆ తర్వాత ఈ అంశం మీద హైదరాబాద్‌లో కూడా ఆందోళన కార్యక్రమాలను నిర్వహించనున్నామని ఆయన తెలిపారు.


