హీరో బాలకృష్ణ ఇంట్లో దొంగలు,15లక్షల నగలు చోరీ
Published on: Fri Jun 8, 2012 10:38AM
ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ ఇంట్లో దొంగలు పడి 15 లక్షలు విలువైన బంగారు ఆభరణాలు చోరీ చేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాలకృష్ణ ఇంట్లో స్వల్ప మరమ్మతులు నిర్వహిస్తుండటంతో ఆయన తోడల్లుడు ఎంఆర్‌వీ ప్రసాద్ ఈనెల 6న బాలయ్య ఇంటికి వచ్చారు. ఇంట్లో ఉన్న ఆభరణాలు కనపడకపోవటంతో విషయం గ్రహించి జూబ్లీహిల్స్ పోలీసులు లకు పిర్యాదు చేశారు. ప్రస్తుతం బాలకృష్ణ, బాలకృష్ణ సతీమణి వసుంధర, పిల్లలు విదేశీ యాత్రలో ఉన్నారు. చోరీకి గురైన ఆభరణాల్లో బంగారు వడ్డాణం, రూబీ డైమండ్ నెక్లెస్, డైమండ్ నెక్లెస్, రెండు జతల డైమండ్ చెవి రింగులు, బ్రాస్‌లెట్, ఒమేగా వాచ్, డైమండ్ బ్రాస్‌లెట్ ఉన్నట్లు ఫిర్యాదు లో పేర్కొన్నారు. వీటి విలువ రూ.15 లక్షలు ఉంటుందని అంచనా వేశా రు. గుర్తు తెలియని వ్యక్తులు లేదా పనిమనుషులు దొంగతనానికి పాల్పడి ఉంటారని ఫిర్యాదులో అనుమానం వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకుని డాగ్ స్వ్కాడ్, ఫింగర్ ప్రింట్స్ సిబ్బంది ద్వారా ఆధారాలు సేకరించారు. అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.


