కిరణ్ కు అధిష్టానం పిలుపు
Published on: Thu Nov 7, 2013 9:19AM
.jpg)
ముఖ్యమంత్రి ఎన్.కిరణ్ కుమార్‌రెడ్డికి అధిష్టానం నుండి పిలుపువచ్చింది. దీంతో శుక్రవారం ఆయన ఢిల్లీకి వెళుతున్నారు. అదే రోజు ఢిల్లీలో జరిగే కాంగ్రెస్‌పార్టీ సమన్వయ సమావేశంలో ఆయన పాల్గొంటారు. ఈనెల 12న కేంద్ర హోంశాఖ నేతృత్వంలో రాష్ట్రవిభజనపై ఏర్పాటైన మంత్రులబృందం అఖిల పక్ష సమావేశాన్ని నిర్వహిస్తున్న నేపథ్యంలో ముఖ్య మంత్రికి అధిష్టానం నుండి పిలుపురావడం ప్రాధా న్యతను సంతరించుకుంది.
రాష్ట్రవిభజనపై కేంద్రం వడివడిగా అడుగులు వేస్తున్న నేపథ్యంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి, ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు ముఖ్య మంత్రి లేఖలు రాయడం, అవకాశమొచ్చిన ప్రతి సభలోనూ సమైక్యరాగాన్ని సిఎం గట్టిగా వినిపించ డాన్ని కాంగ్రెస్ అధిష్టానం తీవ్రంగా పరిగణి స్తోంది. తాను ఫోన్ చేసినా అధిష్టాన ప్రతినిధులు స్పందించటం లేదంటూ ముఖ్య మంత్రి చేస్తున్న వ్యాఖ్యలపట్ల అధిష్టానం గుర్రుగా ఉన్నట్లు సమా చారం. విభజనకు అనుకూలంగా అధిష్టానం తీసు కున్న నిర్ణయానికి ముఖ్యమంత్రి కట్టుబడ తారా? లేక సమైక్యరాగాన్నే అధిష్టానం పెద్దల ముందు వినిపిస్తారా? అనేది అందరిలో ఆసక్తి రేపుతోంది.


