మంత్రి టీజీ పై చెప్పులు, రాళ్లు
Published on: Mon Sep 16, 2013 10:20AM

రాష్ట్ర మంత్రి టీజీ వెంకటేశ్‌పై సమైక్య వాదులు దాడి చేశారు. కర్నూల్ లో ఆయన వాహనంపై సమెక్యవాదులు చెప్పులు, రాళ్లు విసిరారు. దీంతో, సమైక్యవాదులు, టీజీ అనుచరుల మధ్య ఘర్షణ, తోపులాట జరిగింది. దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. ఈ సమయంలోనే, టీజీ తన వాహనం నుంచి బయటకు వచ్చి మీసం మెలేసి ఆవేశంగా మాట్లాడారు. ముగ్గురు ఉపాధ్యాయులు, వైసీపీకి చెందిన కొందరు లాయర్లు, వారి వెనక పది మంది గూండాలు కలిసి చెప్పులు వేయడం సమైక్య పోరాటమా అని ప్రశ్నించారు. శిబిరంలో కూర్చుని నినాదాలు చేయడం కాదని, తన ఎదుటకు రావాలని సవాల్ విసిరారు.


