కాబూల్ ఎయిర్‌పోర్టుపై ఉగ్రవాదుల దాడి
Published on: Thu Jul 17, 2014 9:11AM

ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్ విమానాశ్రయం మీద ఉగ్రవాదులు దాడి చేశారు. మిషన్ గన్లు, పేలుడు పదార్ధాలతో ఉగ్రవాదులు విమానాశ్రయంపై దాడి చేసి విచక్షణా రహితంగా కాల్పులు జరుపుతూ విధ్వంసం సృష్టించారు. సకాలంలో స్పందించిన విమానాశ్రయ భద్రతా సిబ్బంది ఉగ్రవాదులతో ఎదురుకాల్పులకు దిగారు. భారత కాలమాన ప్రకారం గురువారం ఉదయం నాలుగు గంటల సమయంలో ఉగ్రవాదుల దాడి జరిగింది. ఎయిర్ పోర్టుపై ఏ తీవ్రవాద సంస్థ దాడి చేసిందన్న సమాచారం ఇంకా అందలేదు. కాబూల్ఎయర్ పోర్టులో ఇంకా కాల్పులు కొనసాగుతున్నట్టు సమాచారం. ఉగ్రవాద దాడుల నేపథ్యంలో కాబూల్ఎయిర్ పోర్టులో విమాన రాకపోకలను నిలిపివేశారు.


