తెలంగాణకు రెండు రోజుల్లో నైరుతి రుతుపవనాలు
Published on: Thu May 28, 2026 6:47PM
.webp)
మండిపోతున్న ఎండలు, వడగాల్పులు, ఉక్కపోతతో అల్లాడిపోతున్న తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు అందించింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతూ రెండు రోజుల్లో రాష్ట్రంలోకి ప్రవేశించనున్నాయి. ఈ రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వాతావరణం ఒక్కసారిగా చల్లబడటమే కాకుండా, రాగల మూడు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
రుతుపవనాలు రాష్ట్రవ్యాప్తంగా పూర్తిగా విస్తరించడానికి ముందు రాబోయే రెండు రోజుల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లో వడగాలుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని, పగటిపూట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే మరింత ఎక్కువయ్యే ప్రమాదం ఉందని పేర్కొంది. అందువల్ల రుతుపవనాలు పూర్తిగా ప్రవేశించే వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎండ తీవ్రత దృష్ట్యా మధ్యాహ్నం వేళల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.


