TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కేసీఆర్‌కు నాపేరు పలికే ధైర్యం రాలేదు..సీఎం రేవంత్ షాకింగ్ కామెంట్స్

Published on: Wed Apr 30, 2025 6:11PM

 

బీఆర్‌ఎస్ రజతోత్సవ సభలో అధినేత కేసీఆర్‌కు సభ మొత్తంలో తన పేరు ఎత్తడానికి కూడా ధైర్యం రాలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.  బుధవారం శ్రీమహాత్మ బసవేశ్వర జయంతోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నరు. ఈ సందర్బంగా సీఎం రేవంత్ మాట్లాడుతు 16నెలలుగా కేసీఆర్ ఇంట్లో కూర్చుని జీతం తీసుకుంటున్నారని విమర్శించారు. ఎక్కడైనా ఎవరైనా ప్రభుత్వం నుండి జీతం తీసుకుంటూ ఇంట్లో నుండి కాలు కదపకుండా అన్ని వసతులు అనుభవిస్తున్నారా అని ప్రశ్నించారు. మీరెవరు? స‌భ‌కు రాకుండా మమ్మ‌ల్ని ప్ర‌శ్నించే నైతిక హ‌క్కు మీకు ఉందా అని నిల‌దీశారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ‌ను మొద‌టి 10 సంవ‌త్స‌రాలు కోతుల గుంపుకు అప్ప‌జెప్పిన‌ట్టు అయింద‌ని మండిప‌డ్డారు. 

తాను చెడ్డ కోతి వనమంతా చెడించె అన్న‌ట్టు కల్వకుంట్లు ఫ్యామిలీ మొత్తం కలిసి ఈ తెలంగాణ మీద పడి దోచుకున్న మాట వాస్తవం కాదా? అని ప్ర‌శ్నించారు. 12వ శతాబ్దంలోనే సమాజంలో అనేక మార్పులకు పునాదులు వేసిన విప్లవకారుడు బసవేశ్వరుడు. ఆయన జయంతి రోజున పదోతరగతి ఫలితాలు విడుదల చేసుకోవడం సంతోషం. పరీక్షలు పాసైన విద్యార్థులందరికీ శుభాకాంక్షలు. బసవన్న స్ఫూర్తితో మా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు, రైతు రుణమాఫీ, ఉద్యోగాల భర్తీ వంటి కీలక అంశాలపై చర్చించేందుకు కేసీఆర్ వెంటనే శాసన సభకి రావాలని ముఖ్యమంత్రి సవాల్ విసిరారు. అధికారంలో ఉంటేనే పనిచేస్తారా? అధికారం లేకపోతే బాధ్యతలను గాలికొదిలేస్తారా? అని నిలదీశారు. తమ ప్రభుత్వ నిర్ణయాల్లో లోపాలుంటే చెప్పాలని, అంతేకానీ నిరాధార విమర్శలు చేయవద్దని హితవు పలికారు.