కేసీఆర్ కొత్త ఇంటి విషయాలు... అవాక్కవ్వాల్సిందే


తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు కొత్త ఇంట్లోకి ప్రవేశించనున్న సంగతి తెలిసిందే.  బేగంపేటలో మొత్తం లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మితమైన ఈ భవంతి గురించిన విషయాలు వింటే ఆశ్చర్యపోవాల్సిందే. ఎందుకంటే అంత కట్టుదిట్టమైన భద్రతతో ఈ కొత్త బంగళాను తయారు చేయించుకున్నారు కేసీఆర్. తాను వినియోగించే బాత్ రూమ్ ను సైతం బులెట్ ఫ్రూఫ్ గా తయారు చేయించారంటే మీరే అర్థం చేసుకోండి. ఇదంతా  రాష్ట్ర ఇంటెలిజెన్స్ వర్గాలు ఇచ్చిన సూచనల మేరకే కేసీఆర్ నిర్మించుకున్నారట. ఆ వివరాలు ఒకసారి చూద్దాం..


* సీఎం కేసీఆర్, ఆయన కుమారుడు కేటీఆర్ వినియోగించే రెండు పడక గదులను హై క్వాలిటీ గ్లాస్ తో ఫిట్ చేశారు.
* ఎటువంటి బులెట్లు తగిలినా చెక్కు చెదరని అద్దాలతో బాత్ రూం
* ఇంకా కనీసం 50 మంది భద్రతా సిబ్బంది అనునిత్యమూ భవంతికి పహారా
* సుదూర ప్రాంతం నుంచి స్నిప్పర్ రైఫిల్ ద్వారా వచ్చే బులెట్లను అడ్డుకునేందుకే బులెట్ ప్రూఫ్ గ్లాస్ లు
* వీటన్నింటితో పాటు అత్యాధునిక ఆయుధాలను చేతుల్లో కలిగుండే భద్రతా దళాలు, మందుపాతరలతో పేల్చినా ప్రమాదం జరగని కార్లు, జడ్ ప్లస్ సెక్యూరిటీని ఆయనకు కల్పించనున్నారు.