మహానాడులో ప్రత్యేక ఆకర్షణగా బాలకృష్ణ...

 

టీడీపీ అత్యంత ఘనంగా జరుపుకునే మహానాడు కార్యక్రమం తిరుపతిలో ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ప్రముఖ సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కూడా హాజరయ్యారు. అయితే ఈ కార్యక్రమానికి వచ్చిన ఆయన గౌతమీ పుత్ర శాతకర్ణి సినిమాలో భాగంగా పెంచిన మీసకట్టుతో.. మంచి రాజసం ఉట్టిపడేలా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. దీంతో పార్టీ శ్రేణులు, అభిమానులు బాలయ్యతో ఫొటో దిగేందుకు పోటీపడ్డారు.