మూడుసార్లు వెల్‌లోకి వైసీపీ
Published on: Tue Aug 19, 2014 7:40AM
.jpg)
ఆంధ్రప్రదేశ్‌లో శాంతి భద్రతల అంశం మీద చర్చించాలని డిమాండ్ చేస్తూ వైసీపీ సభ్యులు మూడుసార్లు వెల్‌లోకి దూసుకు వెళ్ళడంతో అసెంబ్లీ మూడుసార్లు వాయిదా పడింది. రెండుసార్లు కొద్ది సమయం వాయిదా పడిన అసెంబ్లీ మూడోసారి మాత్రం ఏకంగా మంగళవారానికి వాయిదా పడింది. దాంతో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల మొదటిరోజు ఎలాంటి చర్చా జరగకుండానే ముగిసింది. శాంతి భద్రతలపై మాట్లాడే హక్కు వైకాపాకు లేదంటూ తెలుగుదేశం సభ్యులు, శాంతి భద్రతలను కాపాడాలంటూ వైకాపా సభ్యులు ప్లకార్డుల ప్రదర్శనలకు దిగడంతో సభలో గందరగోళం తలెత్తింది. ఈ సందర్భంగా వైసీపీ సభ్యులు వెల్‌లోకి దూసుకెళ్లి న్యాయం చేయాలని కోరారు. 11మంది వైకాపా కార్యకర్తలు గత మూడు నెలల్లో హత్యకు గురయ్యారని, ఈ అంశంపై చర్చించాలంటూ స్పీకర్‌ను కోరారు.


