రాయపాటికి నాడు మసాజ్ లు, నేడు మెసేజ్ లు
Published on: Wed Jun 6, 2012 12:05PM
గుంటూరు ఎంపి రాయపాటి సాంబశివరావుకు ఇటీవల సెక్స్ రాకెట్ లో అరెస్టు అయి తరువాత బెయిల్ తీసుకున్న తారాచౌదరితో ఉన్నది నిజమైన సంబంధమేనా అన్న విషయంపై నేడు రాష్ట్రవ్యాప్త చర్చ జరుగుతోంది. నిప్పులేకుండా పొగరాదు అన్న చందాన్న ఇటీవల రాయపాటికి ఒక ఎస్ ఎంఎస్ వచ్చింది. దాని సారాంశమేమిటంటే తారాచౌదరితో ఉన్న ఫోటోల సిడి ఇస్తామని, తనను సంప్రదించి కోరినది ఇస్తే అవి సొంతం చేసుకోవచ్చని ఆ ఎస్ ఎంఎస్ లో వివరించారు. ఈ ఎస్ ఎంఎస్ వచ్చిన వెంటనే 60ఏళ్ల రాయపాటి ముందూ వెనుకా ఆలోచించకుండా పోలీస్ స్టేషనుకు వెళ్లి ఆ ఎస్ ఎంఎస్ చూపించి దర్యాప్తు చేయమన్నారు. తీరా! స్టేషన్ బయటకు వచ్చిన తరువాత రాయపాటి తనకూ, ఆ ఎస్ ఎంఎస్ ఇచ్చిన వ్యక్తికి మాత్రమే తెలిసిన విషయాన్ని పోలీసుల ద్వారా లోకానికి తెలియజేశానని అర్థమైంది. నాలిక్కరుచుకున్న రాయపాటి, తారా రహస్య సంబంధం నిజమేనట అక్కడ ఆయన బాడీ మసాజ్ లు కూడా చేయించుకున్నారట...అందుకే ఎస్ ఎంఎస్ కూడా వచ్చిందట అని రాష్ట్రమంతా గుసగుసలాడుకుంటున్నారు. ఎవరు ఫోను చేసినా మీకు ఆ సిడి అందేసిందా? పోలీసులు ఏమైనా ఆ ఎస్ ఎంఎస్ ఇచ్చిన అతన్ని పట్టుకున్నారా? అని పరోక్షంగా రాయపాటి తారాచౌదరి గురించి ప్రశ్నిస్తున్నారట. ఇప్పటి వరకూ మంత్రి పదవి రాకపోయినా బాధపడని రాయపాటి ఇక ఫోను వచ్చిందంటే చాలు తలపట్టుకుంటున్నారట.


