తమిళనాట రాజకీయాలే వేరు
Published on: Mon Oct 8, 2012 2:55PM
తమిళనాట రాజకీయాలే వేరు... ఒక సమస్యపై అందరూ ఆవునంటే... వారు కాదంటారు... తమ పనులను చేయించుకోవడంలో అక్కడి నేతలను చూసి మిగతా వారు నేర్చుకోవాలంటే.. అతిశయోక్తికాదేమో! తక్కువ సీట్లున్నా... కేంద్రంలో కీలకపదవులను పొందడంలోనే వారి రాజకీయం తెలుస్తుంది! అంతేకాదు దేశంలోనే భారీ కుంభకోణాల్లో ఒకటైన 2జి కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొని జైలుకు వెళ్ళిన మంత్రికి సైతం కేంద్రంలో నీరాజనాలు పలుకుతున్న తీరును బట్టి తమిళ తంబిల రాజకీయాలను తెలుసుకోవచ్చు. తమిళ రాజకీయాల్లో వృద్ధసింహం కరుణానిధి రాష్ట్రంలో అధికారం కోల్పోయిన తర్వాత ఆయన దృష్టాంతా ముఖ్యమంత్రి కుర్చీపైనే...! అందుకే చేతికి ఏ అవకాశం చిక్కినా వదులుకోరు... కుర్చీలో వుండే రాజకీయాలు నడపగల దిట్ట... అందుకే అధికార ఎఐఎడిఎంకె ప్రజావ్యతిరేక కార్యక్రమాలను నిర్వహిస్తోందని... అందుచేత ఇక నుండి... ప్రభుత్వ ప్రజా వ్యతిరేక కార్యక్రమాలకు నిరసనగా నల్లచొక్కాలే ధరిస్తానని’ అని కరుణానిధి శపథం చేశారు. మళ్ళీ డిఎంకెకు అధికారంవస్తే అన్ని ప్రజాకార్యక్రమాలే ఉన్నట్లు లెక్క....! ఎలాగో ఆయన నల్లకళ్ళజోడు ధరిస్తారు... ఎదుటివాళ్ళని కళ్ళతో ఎక్కిరిస్తున్నా తెలుసుకోకుండా వుండేందుకు అన్నట్లు... ఇప్పుడు నల్లదుస్తులు...మాత్రమే వేసుకుంటానన్నారు.. ప్రజలు అదృష్టవంతులు... బతికిపోయారు?


