TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

జయలలిత కొత్తస్కీమ్: రూపాయికే ఇడ్లీ, పెరుగన్న రూ.3

Published on: Tue Jan 15, 2013 9:34AM

 

 

Tamil Nadu CM Jayalalitha Idly 1 rupee, Tamil Nadu CM Jayalalitha Idly 1 rupee, Meals 10, Tamil Nadu CM Jayalalitha Idly 1

 

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఓ ప్రజాకర్షక పథకానికి రంగం సిద్దం చేశారు. కేవలం 5 రూపాయలకు భోజనం, రూపాయికి ఇడ్లీ పెట్టేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. సంక్రాంతి పండుగ సంధర్భంగా ఆమె తన కొత్త నిర్ణయం వెలువరించారు. ఈ భోజన పధకం కోసం వెయ్యి క్యాంటిన్లు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆమె వెల్లడించారు.ఇందులో ఐదు రూపాయలకు భోజనం,మూడు రూపాయలకు పెరుగన్నం, రూపాయికి ఇడ్లి విక్రయిస్తారు.


పేదలకు గొప్పవరంగా ఈ పథకం మారుతుందని అంటున్నా ..వారిని బద్దకస్తులు చేయడానికి ఇది పనికి వస్తుందని విమర్శలు కూడా వస్తున్నాయి. అయితే ఇప్పటికే గుజరాత్ లో ఇలాంటి పథకం అమలు శ్రీకారం చుట్టారు. రూ.10 కి చపాతి, కుర్మా అందించేందుకు రంగం సిద్దం చేశారు. ఢిల్లీలోనూ జన ఆహార కేంద్రాల పేరుతో అల్పాహారం అందిస్తున్నారు.